అఫ్గానిస్థాన్‌లో దారుణం జరిగింది. కాబుల్ మిలిటరీ ఎయిర్‌పోర్టు మెయిన్ గేట్‌కు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఉత్తర తఖార్ ప్రావిన్స్ రాజధాని తాలూకాన్ నగరంలో బుధవారం పేలుడు జరిగి నలుగురు వ్యక్తులు గాయపడిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
మిలిటరీ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు పేలుడు.. 10మంది మృతి.. 8 మందికి గాయాలు - ఆఫ్గనిస్థాన్‌లో బాంబ్ పేలుడు న్యూస్
అఫ్గానిస్థాన్‌లో విషాదకర ఘటన జరిగింది. కాబుల్ మిలిటరీ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మిలిటరీ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు పేలి పదిమంది మృతి
తఖార్‌లోని తాలిబాన్ భద్రతా కమాండర్ అబ్దుల్ ముబిన్ సఫీ ఈ పేలుడును ధ్రువీకరించారు. స్థానిక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ డెస్క్ కింద బాంబు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారని అక్కడి వార్తా సంస్థ నివేదించింది. గత కొన్ని నెలలుగా ఇలాంటి పేలుళ్లు సంభవిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
TAGGED:
afghanistan bomb blast news