తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా చైనా జీవాయుధం.. మనుషులకు సోకేలా తయారీ'.. వుహాన్​ సైంటిస్ట్ షాకింగ్ కామెంట్స్​ - కరోనా జననంపై షాకింగ్ కామెంట్స్

కరోనా వైరస్​ను చైనా ఓ జీవాయుధంగా రూపొందించినట్లు వుహాన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ప‌రిశోధ‌కులు చావో షావో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. షాకింగ్​ విషయాలను వెల్లడించారు. అవేంటంటే?

Biological Terrorism
Biological Terrorism

By

Published : Jun 28, 2023, 1:31 PM IST

Coronavirus Birth : ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగించి లక్షలాది మందిని బలిగొన్న కరోనా వైరస్‌ను చైనా జీవాయుధంగా తయారు చేసిందా..? మనుషులకు సోకేలా చేయాలనే ఉద్దేశంతోనే వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌లో చైనా దాన్ని సృష్టించిందా..? అంటే అవుననే అంటున్నారు వుహాన్‌ ఇన్​స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ పరిశోధకుడు చావో షావో. ఓ ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.

China Covid Latest News : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణానికి కారణమైన కొవిడ్‌నుచైనా ఓ జీవాయుధంగా రూపొందించినట్లు వుహాన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ప‌రిశోధ‌కులు చావో షావో తెలిపారు. ఈ షాకింగ్ విష‌యాల‌ను ఆయన ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. వుహాన్‌ ప్రయోగశాలలో తన సహచర పరిశోధకులు షాన్‌ చావోకు ఉన్నతాధికారి నాలుగు రకాల కరోనా వైరస్‌లు ఇచ్చి వాటిలో ఏది వేగంగా వ్యాపిస్తుందో కనుగొనమన్నారని చావో షావో తెలిపారు. ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ సభ్యులు జెన్నిఫర్‌ జెంగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావో షావో ఈ విషయం వెల్లడించారు. 26 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ సాగింది.

Coronavirus News : వీలైనంత మందిని సోకే సామ‌ర్థ్యం ఏ వైర‌స్‌కు ఉందో ప‌రీక్షించిన‌ట్లు ఆ ప‌రిశోధకులు తెలిపారు. మ‌నుషుల‌తో పాటు ఇతర జీవాల‌కు ఏ వైర‌స్ తొంద‌ర‌గా సోకుతుందో టెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు. క‌రోనా వైర‌స్‌ను ఓ జీవాయుధంగా చైనా అభివృద్ధి చేసింద‌ని చావో షావో పేర్కొన్నారు.

2019లో వుహాన్‌లో జ‌రిగిన మిలిట‌రీ వ‌ర‌ల్డ్ గేమ్స్ స‌మ‌యంలో త‌నతో ప‌నిచేసే చాలా మంది వైరాలజిస్టులు కనిపించకుండా పోయారన్నారు చావో షావో. వేరే దేశాల‌కు చెందిన అథ్లెట్లు ఉంటున్న హోట‌ళ్లకు త‌మ‌ను పంపార‌ని.. అక్కడి వారి ఆరోగ్యం, పరిశుభ్ర ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించేందుకు త‌మ‌ను పంపిన‌ట్లు సీనియ‌ర్లు చెప్పార‌న్నారు. కానీ వైరాల‌జిస్టులు ఆరోగ్యం పరిశీలించరని షావో అన్నారు. అవ‌స‌రం లేని ప్రాంతాల‌కు త‌మ‌ను పంపి.. వైర‌స్‌ను వ్యాప్తి చేసేందుకు ప్రయ‌త్నించిన‌ట్లు చావో షావో ఆరోపించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి వైరాలజిస్ట్ అవసరం లేదు కాబట్టి, వైరస్ వ్యాప్తి చెందడానికి లేదా మానవులలో అది ఎలా స్పందిస్తుందో గమనించడానికి తనను పంపినట్లు షావో నొక్కి చెప్పారు. షిన్‌జియాంగ్‌లో వీగర్లు ఉంటున్న క్యాంపుల వ‌ద్దకు కూడా త‌మ‌ను పంపిన‌ట్లు ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details