Bill Gates: మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్- మెలిందా దంపతులు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వీరు విడిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, ఆదివారం బిల్‌గేట్స్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ .. తన మనసులోని మాటలను వెల్లడించారు. మెలిందాతో జరిగిన వివాహం ఎంతో గొప్పదన్నారు. అవకాశం వస్తే.. తననే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటానని తెలిపారు.
"గత రెండు సంవత్సరాల్లో నా జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పిల్లలు ఎదిగి, వారు మనల్ని విడిచి వెళ్లిన తర్వాత వివాహ బంధంలో మార్పు చోటుచేసుకుంటుంది. కానీ నా జీవితంలో ఆ మార్పు విడాకులు. అయితే నా దృష్టిలో మాది గొప్ప వివాహం. జరిగిన దానిని నేను మార్చలేను. మీకు తెలుసా.. నేను వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. మిలిందాను మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి భవిష్యత్తు ప్రణాళికలు అయితే లేవు. అయితే ఇప్పటికీ మెలిందాతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటికీ తనతో స్నేహంగానే ఉన్నానని నమ్ముతున్నాను. మా మధ్య అత్యంత ముఖ్యమైన, సంక్షిష్టమైన, సన్నిహిత సంబంధం ఉంది. మేం కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మీకు తెలుసా.. మేము ఫౌండేషన్‌ను కలిసి స్థాపించాం" అంటూ ఈ మధ్యకాలంలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు.
ఇవీ చూడండి: