తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రేమలో పడిన బిల్​గేట్స్.. ఆమెతో డేటింగ్.. వీడిన మిస్టరీ! - బిల్​గేట్స్ లవ్​స్టోరి

మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్​గేట్స్ ప్రేమలో పడ్డారు. గతకొంత కాలంగా ఒరాకిల్ మాజీ సీఈఓ భార్య పాలా హర్డ్​తో డేటింగ్​లో ఉన్నారు.

bill gates in love with paula hurd
ప్రేమలో పడిన బిల్​గేట్స్

By

Published : Feb 9, 2023, 5:00 PM IST

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ ప్రేమలో పడ్డారు. కొంత కాలంగా ఈయన ఓ మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు వచ్చినా.. వీరి ప్రేమ వ్యవహారంపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఆమె ఎవరనే వివరాలు బయటకు వచ్చాయి. 'మిస్టరీ వుమెన్'​గా పిలుస్తున్న ఆమెను.. మాజీ ఒరాకిల్ సీఈఓ భార్య పాలా హర్డ్ అని తెలిసింది.

రెండేళ్ల క్రితం 2021లో భార్య మెలిందాతో 27 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు బిల్​గేట్స్. వారు మే 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టులో విడాకుల ప్రక్రియ పూర్తయింది. మెలిందా గేట్స్ మాజీ రిపోర్టర్ జాన్​ డూ ప్రీతో రిలేషన్​లో ఉన్నారనే వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు బిల్​గేట్స్​తో డేటింగ్​లో ఉన్న పాలా హర్డ్ ఒరాకిల్ మాజీ సీఈఓ మార్క్ హర్డ్ భార్య. మార్క్ హర్డ్ 2019 క్యాన్సర్​తో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. అప్పటి నుంచి పాలా హర్డ్ ఒంటరిగానే ఉంటున్నారు.

గత ఏడాది నుంచి డేటింగ్​లో ఉన్న బిల్​గేట్స్, హర్డ్ తమ ప్రేమ గురించి గోప్యంగా ఉంచారు. బిల్​గేట్స్(67), పాలా హర్డ్(60) ఇద్దరూ టెన్నిస్ లవర్స్. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఫైనల్ టోర్నమెంట్​లో ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్​ను వీక్షిస్తుండగా కెమెరాలు వారి ఫొటోలను క్లిక్​మనిపించాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details