Biden signs gay marriage bill: స్వలింగ సంపర్కుల వివాహలకు అగ్రరాజ్యం అమెరికా చట్ట బద్దత కల్పించింది. అమెరికా చట్టసభలు ఆమోదం తెలిపిన "సేమ్ సెక్స్ మ్యారెజ్ ప్రొటెక్షన్ బిల్"పై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో ఆ బిల్లు చట్టంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన అధ్యక్షుడు జో బైడెన్ సమానత్వం దిశగా అమెరికా మరో అడుగు వేసిందని పేర్కొన్నారు.
స్వలింగ వివాహాలకు అమెరికాలో చట్టబద్ధత.. కీలక బిల్లుపై బైడెన్ సంతకం - సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లు
స్వలింగ సంపర్కుల వివాహాలకు అమెరికాలో చట్టబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ద్వారా సమానత్వం దిశగా అమెరికా మరో అడుగు వేసిందని జో బైడెన్ పేర్కొన్నారు.
స్వేచ్ఛ, న్యాయం కొందిరిది కాదని.., అందరి సొంతమని చెప్పే విధంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కుల వివాహ రక్షణ బిల్లు సెనేట్‍లో ఆమోదం పొందినప్పుడు కూడా బైడెన్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ చట్టాన్ని అందరూ గౌరవించాలని, ప్రేమ ఎవరిదైనా ప్రేమే అనే ప్రాథమిక నిజాన్ని చాటిచెప్పేందుకు అమెరికా సమీప దూరంలో ఉందని పేర్కొన్నారు. ఇష్టపడే వారిని వివాహం చేసుకునే హక్కు అమెరికన్లకు ఉండాలని వ్యాఖ్యానించారు. మరోవైపు బైడెన్ సంతకంతో స్వయం సంపర్కులు సంతోషంలో మునిగిపోయారు. తమ హక్కులను గుర్తించి బిల్లుకు చట్టబద్దత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.