తెలంగాణ

telangana

ETV Bharat / international

'పుతిన్​కు అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదు' - రష్యా లేటెస్ట్ న్యూస్

Biden on Russia Putin: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌.. రష్యా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు.

Biden on Russia Putin
'పుతిన్​ రష్యా అధ్యక్ష పదవికి అనర్హుడు'

By

Published : Mar 27, 2022, 6:31 AM IST

Biden on Russia Putin: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగిస్తున్న క్రమంలో.. పుతిన్​ రష్యా అధ్యక్షుడిగా ఉండడం తగదని, ఆయన్ను తొలగించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అభిప్రాయపడ్డారు. నాటో కూటమి దేశాల్లో ఒక్క అంగుళం భూభాగంలో కూడా చొరబడే ఆలోచన చేయొద్దని.. పుతిన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. నాలుగు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా చివరి రోజు పోలాండ్‌లోని ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని బైడెన్‌ సందర్శించారు.

"రష్యా అధినేత కఠినాత్ముడు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో లక్షలాది ప్రజలను శరణార్థులుగా మార్చారు. పుతిన్‌ దురాక్రమణను ఎదుర్కొనేందుకు దీర్ఘకాల పోరాటానికి ఐరోపా సమాయత్తం కావాలి. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు పుతిన్ అనుసరిస్తున్న తీరుతో దశాబ్దాలపాటు సాగే యుద్ధం వచ్చేలా ఉంది."

-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

మరోవైపు రష్యాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బైడెన్‌ పిలుపునివ్వడం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. పొరుగు దేశాలపై అధికారం చెలాయించేందుకు పుతిన్‌ను అనుమతించలేమని చెప్పడంలో భాగంగా బైడెన్‌ ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:ఉక్రెయిన్​పై ఆగని దాడులు.. 16,400 మంది రష్యా సైనికులు మృతి!

ABOUT THE AUTHOR

...view details