Biden modi meet: భారత్, అమెరికా బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ఒకే విధంగా పోలిన ఆలోచనలు, విలువలు బంధాన్ని బలోపేతం చేశాయని అన్నారు. ఇండో పసిఫిక్ అంశంపై ఇరు దేశాల ఆలోచన విధానం ఒక్కలాగే ఉందని తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని భేటీ అయ్యారు. అంతకుముందు క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొన్నారు.
"వ్యాపార, పెట్టుబడులకు సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య బంధం ఇంతకుముందుతో పోలిస్తే మెరుగైంది. కానీ అది ఆశించిన స్థాయికి ఇంకా చేరుకోలేదు. యూఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్‌తో ఇరు దేశాల మధ్య వ్యాపార పరంగా కూడా బంధం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను"