Biden India Visit :ప్రతిష్టాత్మక జీ 20సమావేశాలకు హాజరయ్యేందుకు భారత్‌కు పయనమయ్యారుఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ పర్యటనలో బైడెన్ కొవిడ్ ప్రొటోకాల్స్ అన్ని పాటిస్తారని అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌథం తెలిపింది. ఇటీవలే ఆయన భార్య కొవిడ్ బారిన పడడం వల్ల బైడెన్‌కు సైతం పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. తాజాగా భారత్ పర్యటనకు బయలుదేరేముందు కూడా బైడెన్‌కు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రావడం వల్ల భారత్ పర్యటనకు బయలుదేరారు. తర్వాత ఆయన భార్యకు పరీక్షలు చేయగా.. నెగిటివ్‌గా వచ్చింది.
మోదీతో ద్వైపాక్షిక చర్చలు
Biden G20 : మరోవైపు జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలుత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. శుద్ధ ఇంధనం, వాణిజ్యం, హైటెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధంపై ఇరువురు నేతలు సమీక్షంచనున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తదితర అంశాలుపైనా చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల పురోగతని సమీక్షించనున్నారు. అనంతరం ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండ్రోజుల పాటు జరిగే జీ20 శిఖరాగ్ర సదుస్సులో బైడెన్ పాల్గొంటారు.
స్పెయిన్ అధ్యక్షుడికి కొవిడ్.. జీ 20కి డుమ్మా
Spain President G20 : మరోవైపు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాచెంజ్కు కొవిడ్ సోకడం వల్ల జీ 20 సమావేశాలకు ఆయన గైర్హాజరు కానున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తమ దేశ తరఫున ఉపాధ్యక్షుడు నడియా కాల్వినో, విదేశాగం, ఆర్థిక మంత్రులు హాజరు అవుతారని తెలిపారు.