తెలంగాణ

telangana

ETV Bharat / international

కుప్పకూలిన విద్యుత్​ వ్యవస్థ.. 13 కోట్ల మందికి కరెంట్ కట్ - bangladesh blackout 2022

బంగ్లాదేశ్​లో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్​ గ్రిడ్​ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ఆ దేశంలోని పలు ప్రాంతాలు చీకటిమయమయ్యాయి.

power cut in bangladesh
grid failure in bangladesh

By

Published : Oct 5, 2022, 7:46 AM IST

Bangladesh blackout news : బంగ్లాదేశ్‌లో విద్యుత్‌ గ్రిడ్‌ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారం మధ్యాహ్నం దాదాపు 13 కోట్ల మందికి కరెంటు లేకుండా పోయిందని ప్రభుత్వ విద్యుత్‌ సంస్థ తెలిపింది. స్థానిక కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దేశంలో 80 శాతానికి పైగా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో ఆకస్మిక అంతరాయం ఏర్పడిందని పవర్ డెవలప్‌మెంట్ బోర్డు వెల్లడించింది. వాయువ్య బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు మినహాయించి.. మిగతా దేశమంతా కరెంట్‌ పోయిందని బోర్డు ప్రతినిధి షమీమ్ ఎహసాన్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. 13కోట్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారన్నారు. ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని.. ఈ అంతరాయానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదన్నారు. బహుశా సాంకేతిక లోపాలు కారణం కావచ్చని అంచనా వేశారు.

అంధకారంలో బంగ్లాదేశ్

దాదాపు 2.2 కోట్ల మంది నివసించే దేశ రాజధాని ఢాకా పరిధిలో రాత్రి 8 గంటల నాటికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని మంత్రి జునైద్ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రస్తుత జనాభా దాదాపు 16.51 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో.. అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల కారణంగా బంగ్లాదేశ్ ఇటీవలి నెలల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. విద్యుత్‌ డిమాండ్‌ కోసం దిగుమతి చేసుకున్న డీజిల్, గ్యాస్‌ ధరల చెల్లింపులు.. ప్రభుత్వానికి భారంగా మారాయి. మరోవైపు.. కరెంట్‌ కోతలపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్‌లో చివరిసారి 2014 నవంబర్‌లో భారీ బ్లాక్‌ అవుట్‌ ఏర్పడింది. ఆ సమయంలో దేశంలో దాదాపు 70 శాతం మందికి దాదాపు 10 గంటలపాటు విద్యుత్‌ సౌకర్యం లేకుండా పోయింది.

అంధకారంలో బంగ్లాదేశ్

ABOUT THE AUTHOR

...view details