ఎవరైనా చనిపోతే వారికి అదే రోజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. లేదంటే కుటుంబసభ్యులు వచ్చేవరకూ వేచిచూసి చనిపోయిన మరుసటి రోజు నిర్వహిస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన భార్య శవాన్ని 21 సంవత్సరాలు ఇంట్లోనే దాచుకున్నాడు. చివరికి భయమేసి ఓ ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం చెప్పి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కోరాడు.
21 సంవత్సరాలుగా భార్య శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని.. ఆపై భయం వేసి..
ఓ వ్యక్తి.. తన భార్య మృతదేహాన్ని 21 సంవత్సరాలుగా ఇంట్లోనే దాచిపెట్టుకున్నాడు. ఆ తర్వాత భయం వేసి తనకు తెలిసిన ఛారిటబుల్ ట్రస్ట్ వారి దగ్గరకి వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో వాళ్లు శవపేటికలో ఉన్న అతడి భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ జరిగింది.. బ్యాంకాక్‌కు చెందిన ఓ వ్యక్తి(72) తన భార్య, ఇద్దరు పిల్లలతో నివసించేవాడు. 2001లో ఆయన భార్య అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది. దీంతో ఆమె శవాన్ని ఓ శవపేటికలో పెట్టి ఇంట్లోనే దాచి పెట్టుకున్నాడు. కొన్ని రోజులకు ఆయన ప్రవర్తనతో విసుగు వచ్చి ఇద్దరు కొడుకులూ ఆయనని వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతనొక్కడే మృతదేహంతో ఉంటున్నాడు. చివరికి 21 సంవత్సరాల తరువాత చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించకపోతే ఏమైనా అవుతుందేమోనని భయం వేసింది. దీంతో అతనికి గతంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సాయం చేసిన ఓ ఛారిటబుల్ ట్రస్ట్ వారిదగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. తన భార్య శవానికి అంత్యక్రియలు చేయాల్సిందిగా వాళ్లని అభ్యర్థించాడు. దీంతో వాళ్లు శవపేటికలో ఉన్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 'ఆ వ్యక్తి మాత్రం భార్య మృతదేహం వద్ద కూర్చొని ‘మీరు చిన్న వ్యాపార పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతున్నారు. ఎక్కువరోజులు ఉండరు. తిరిగి మళ్లీ వచ్చేస్తారని నేను మీకు మాటిస్తున్నాను' అంటూ రోదించాడు.
ఇదీ చదవండి:ఆన్లైన్లో 'చికెన్ టిక్కా పిజ్జా' ఆర్డర్- 2 ముక్కలు తిన్న క్షణాల్లోనే గుండె ఆగి..