ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక సూపర్‌స్టార్స్ ఆఫ్ 'స్టెమ్' (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమేటిక్స్) అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన 60 మంది శాస్త్రవేత్తల్లో భారతీయ మూలాలున్న నీలిమా కడియాల, డాక్టర్ అనా బాబూరమణి, డాక్టర్ ఇంద్రాణి ముఖర్జీ చోటు సాధించారు. శాస్త్రవేత్తల గురించి సమాజంలో ఉన్న లింగ ఆధారిత అంచనాలను తుడిచిపెట్టడమే కాకుండా.. మహిళలు, హిజ్రాలకు మరింత అభివృద్ధి అవకాశాలను కల్పించడమే ఈ అవార్డుల లక్ష్యమని బుధవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. లక్షకు పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ప్రతినిధులుగా ఉన్న 'సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్ట్రేలియా' (ఎస్‌టీఏ) ఏటా ఇలా 60 మంది ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తోంది.
ఆస్ట్రేలియా 'స్టెమ్' సూపర్‌స్టార్స్‌గా.. ప్రవాస భారతీయ మహిళా శాస్త్రవేత్తలు - ఇంద్రాణి ముఖర్జీ
ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక సూపర్‌స్టార్స్ ఆఫ్ 'స్టెమ్' అవార్డుకు భారతీయ మూలాలు ఉన్న శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. నీలిమా కడియాల, డాక్టర్ అనా బాబూరమణి, డాక్టర్ ఇంద్రాణి ముఖర్జీ ఈ అవార్డు దక్కించుకున్నవారి జాబితాలో చోటు సాధించారు.
AUSTRALIA STEM SUPERSTARS
2003లో విద్యార్థిగా ఆస్ట్రేలియాకు వెళ్లిన నీలిమా కడియాల ఛాలెంజర్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ అనా బాబూరమణి డిఫెన్స్ - సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. మెల్‌బోర్న్‌లోని మొనాష్ విశ్వవిద్యాలయం నుంచి ఈమె పీహెచ్‌డీ చేశారు. డాక్టర్ ఇంద్రాణి ముఖర్జీ టాస్మేనియా విశ్వవిద్యాలయంలో జియాలజిస్ట్‌గా పనిచేస్తూ జీవ పరివర్తన పరిశోధనలపై దృష్టి సారించారు.