Attack On Biden Grand Daughter Security Vehicle :అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నయోమీ బైడెన్.. సెక్యూరిటీ (సీక్రెట్ సర్వీస్)కు చెందిన వాహన శ్రేణిలోని ఓ కారులోకి చొరబడేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించారు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. అసలేం జరిగింది?
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి.. వాషింగ్టన్‌లోని జార్ట్ టౌన్‌కు నియోమీ బైడెన్ వెళ్లారు. ఆ సమయంలో ఆమెతోపాటు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అక్కడే ఆపి ఉన్న నియోమీకి భద్రత కల్పించే సీక్రెట్ సర్వీస్ వాహనశ్రేణిలోని ఓ కారు అద్దం పగలగొట్టేందుకు ముగ్గురు యువకులు యత్నించారు. వెంటనే సెక్యూరిటీ ఏజెంట్లలో ఒకరు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ముగ్గురూ.. మరో కారులో పరారయ్యారు. నిందితుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
వైట్ హౌస్‌లో వివాహం
గతేడాది నయోమీ బైడెన్ వివాహం ఘనంగా జరిగింది. వైట్‌హౌస్‌లో జరిగిన 19వ వివాహం అది. శ్వేత సౌధంలో ఒక అధ్యక్షుడి మనవరాలి వివాహం జరగడం అదే తొలిసారి. నయోమి కంటే నీల్ మూడేళ్లు చిన్న కావడం గమనార్హం. ప్రస్తుతం నీల్ వయసు 26. నయోమీ బైడెన్ (29) వాషింగ్టన్‌లో లాయర్‌గా పనిచేస్తున్నారు. హంటర్ బైడెన్, ఆయన తొలి భార్య కాథ్లీన్ బూహ్లేల సంతానమే నయోమి.
నయోమీ బైడెన్ దంపతులతో జో బైడెన్ (పాత చిత్రం) 'బైడెన్ కొత్త శునకం'
కొన్నాళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబంలోకి కొత్త శునకం చేరింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు బైడెన్. ఈ జర్మన్ షెపర్డ్‌కు 'కమాండర్' అని పేరు పెట్టారు. కమాండర్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌కు జత చేశారు బైడెన్. 'శ్వేత సౌధానికి స్వాగతం కమాండర్' అని రాసుకొచ్చారు. కమాండర్‌ను అధ్యక్షుడి సోదరుడు జేమ్స్ బైడెన్ కానుకగా ఇచ్చారు. కమాండర్‌కు ముందు రెండు శునకాలు బైడెన్ కుటుంబంలో ఉండేవి. 'ఛాంప్'.. కొన్నాళ్ల క్రితం మరణించింది. మరో శుకనం 'మేజర్' ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల దానిని శిక్షణా కేంద్రానికి పంపించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.