మెక్సికోలోని శాన్ ఆంటోనియోలో ఓ ట్రక్కులో మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. రిమోట్ బ్యాక్ రోడ్డులో వెళ్తున్న ఆ ట్రక్కులో 46 మృతదేహాలను గుర్తించారు అధికారులు. ట్రక్కులో ఉన్న మరో 16 మందిని అధికారులు శాన్ ఆంటోనియాలోని ఆసుపత్రికి తరలించారు.
సరిహద్దు దాటుతున్న ట్రక్కులో 46 మృతదేహాలు.. పోలీసులు హైఅలర్ట్
07:45 June 28
సరిహద్దు దాటుతున్న ట్రక్కులో 46 మృతదేహాలు.. పోలీసులు హైఅలర్ట్
"ఆసుపత్రికి తరలించిన వారి శరీరాలను తాకితే చాలా వేడిగా అనిపిస్తుంది. వారంతా డీహైడ్రేట్ అయ్యారు. వాహనంలో నీరు ఎక్కడ కనబడలేదు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఓ వ్యక్తి.. వాహనం దగ్గర సహాయం కోసం బిగ్గరగా అరిచాడు. అది విని అప్రమత్తమయ్యాం. వెంటనే వచ్చి తనిఖీ చేసి చూసేసరికి లోపల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గరిని అదుపులోకి తీసుకున్నాం" అని పోలీసులు తెలిపారు.
వీరంతా అమెరికాలోని దక్షిణ టెక్సాస్ ప్రాంతానికి అక్రమంగా వలస వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోందన్నారు. ట్రక్కులోని వారు ఎలా మృతిచెందారనే విషయంపై పూర్తి దర్యాప్తు చేపడతున్నామని చెప్పారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:ఉక్రెయిన్ షాపింగ్మాల్పై రష్యా దాడి.. 10 మంది మృతి.. భవనంలో వెయ్యి మందికిపైగా పౌరులు!