South African nightclub: నైట్ క్లబ్ లోపల 21 మంది విద్యార్థులు విగతజీవులుగా కనిపించిన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈస్ట్ లండన్‌లోని సీనరీ పార్క్ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుల్లో చాలా మంది 13 ఏళ్లలోపు వారే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షలు అయిపోయాయని ఆనందంతో.. విద్యార్థులు పార్టీ చేసుకుంటున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది.
పరీక్షలు అయిపోయాయని విద్యార్థుల పార్టీ.. 21 మంది మృతి! - విద్యార్థులు మృతి
దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్లో దారుణం జరిగింది. 21 మంది విద్యార్థులు అనుమానాస్పద రీతిలో మరణించారు. పరీక్షలు అయిపోయాయని ఆనందంతో విద్యార్థులు పార్టీ చేసుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
South African nightclub while celebrating end of exams
వారి మృతికి స్పష్టమైన కారణం తెలియకపోయినప్పటికీ తొక్కిసలాట లేదా విషప్రభావానికి గురయ్యారని అనుమానిస్తున్నారు. మృతదేహాలు నైట్ క్లబ్‌లోని టేబుల్స్ సహా నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లబ్ బయట భారీగా జనం గుమిగూడారు.
ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. విద్యార్థుల మృతికి గల కారణాలను తెలుసుకుని కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Last Updated : Jun 27, 2022, 7:08 AM IST