కరోనా లాక్‌డౌన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. అయితే కొందరు ప్రతిభావంతులు ఆ ఖాళీ సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ కేరళకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే రూపొందించాడు. తయారుచేయడమే కాదు.. కుటుంబంతో కలిసి దాంట్లో పలు దేశాల్లో విహారయాత్రలు చేయడం విశేషం.
లాక్డౌన్లో బోర్ కొట్టి విమానం తయార్.. ఫ్యామిలీతో ప్రపంచమంతా టూర్! - home built aeroplane
పైలట్ లైసెన్స్ కలిగిన అశోక్ గతంలో టూ సీటర్ విమానాలను అద్దెకు తీసుకొని అందులో విహారయాత్రలు చేసేవాడు. వివాహం, అనంతరం ఇద్దరు కుమార్తెలు కలగడంతో ఆయనకు నాలుగు సీట్ల విమానం అవసరమయ్యింది. ఈ విమానాలు అద్దెకు అరుదుగా లభిస్తుండటం, అవీ పాతవి కావడంతో తానే ఓ ఫోర్ సీటర్ విమానాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇందుకు లాక్‌డౌన్ కాలం కలిసొచ్చింది.
కేరళలోని అలపుళకు చెందిన అశోక్ అళిసెరిల్ థామరక్షణ్ (38) బ్రిటన్‌లో స్థిరపడ్డాడు. మాజీ ఎమ్మెల్యే ఏవీ థామరక్షణ్ కుమారుడే ఈ అశోక్. 2006లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు లండన్ వెళ్లి చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఫోర్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పైలట్ లైసెన్స్ కలిగిన అశోక్ గతంలో టూ సీటర్ విమానాలను అద్దెకు తీసుకొని అందులో విహారయాత్రలు చేసేవాడు. వివాహం, అనంతరం ఇద్దరు కుమార్తెలు కలగడంతో ఆయనకు నాలుగు సీట్ల విమానం అవసరమయ్యింది. ఈ విమానాలు అద్దెకు అరుదుగా లభిస్తుండటం, అవీ పాతవి కావడంతో తానే ఓ ఫోర్ సీటర్ విమానాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇందుకు లాక్‌డౌన్ కాలం కలిసొచ్చింది. ఆ సమయంలో పరిశోధనలు చేసి, అన్నీ తెలుసుకొని విమానాన్ని రూపొందించే పనిలోపడ్డాడు.
సొంతంగా విమానాన్ని నిర్మించేందుకు జోహన్నెస్‌బర్గ్‌కు చెందిన 'స్లింగ్ టీఎస్‌ఐ' ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ ఫ్యాక్టరీని సంప్రదించాడు. విమానాల తయారీకి ఆ సంస్థ ఆర్డర్ చేసే కిట్‌లకు అదనంగా మరో కిట్ ఆర్డర్ చేసేలా ఆ సంస్థను ఒప్పించారు. అనంతరం ఆ కిట్ రాగానే తన పని ప్రారంభించాడు. దాదాపు 18నెలలు కష్టపడి నాలుగు సీట్ల విమానాన్ని సొంతంగా రూపొందించాడు. ఇందుకు దాదాపు రూ.1.8కోట్లు ఖర్చుచేశాడు. ఆ స్లింగ్ టీఎస్‌ఐ మోడల్ విమానానికి తన చిన్న కుమార్తె పేరు వచ్చేలా 'జి-దియా'గా నామకరణం చేశాడు. విమానం పూర్తిగా సిద్ధయ్యాక కుటుంబంతో కలిసి ఆయన ఇప్పటివరకు యూరోప్‌లోని జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలకు విహరించారు. ఖాళీ దొరికినప్పుడల్లా తమ విమానంలో మరిన్ని ప్రాంతాలను చుట్టివస్తామని అశోక్ పేర్కొన్నాడు.