తెలంగాణ

telangana

ETV Bharat / international

హెచ్​-1బీ వీసాదారులకు గుడ్​న్యూస్.. ఇక అమెరికాలోనే రెన్యూవల్​

వీసా నిబంధనల్లో బైడెన్‌ సర్కారు మరో మార్పు చేపట్టబోతోంది. వీసా రెన్యువల్‌ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా 'డొమెస్టిక్‌ వీసా రీవ్యాలిడేషన్‌' ప్రక్రియను పునరుద్ధరించబోతోంది. ఈ నిర్ణయం విదేశీ సాంకేతిక నిపుణులకు ముఖ్యంగా భారత్‌ నుంచి వెళ్లే వేలాదిమందికి ప్రయోజనం కలగనుంది.

H1B Visas Renewal
హెచ్​-1బీ వీసాల పునరుద్ధరణ

By

Published : Feb 10, 2023, 7:06 PM IST

హెచ్​-1బీ వీసాదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. హెచ్​-1బీ, ఎల్​1 వీసాల రెన్యూవల్‌ త్వరలో అమెరికాలోనే జరగనుంది. ఈ ఏడాది చివరి నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని అగ్రరాజ్యం ఆలోచిస్తోంది. ఈ నిర్ణయం విదేశీ సాంకేతిక నిపుణులకు ముఖ్యంగా భారత్‌ నుంచి వెళ్లే వేలాదిమందికి ప్రయోజనం కలగనుంది. తమ దేశంలోని కంపెనీలు నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవటానికి వీలుగా అమెరికా మూడేళ్ల కాలానికి హెచ్-​1బీ వీసాలను జారీ చేస్తుంది.

2004 వరకు కొన్ని కేటగిరీలకు చెందిన వలసేతర వీసాలు ముఖ్యంగా హెచ్​-1బీ వీసాల రెన్యూవల్‌ లేదా స్టాంపింగ్‌ అమెరికాలోనే జరిగేది. ఆ తర్వాత ఈ విధానాన్ని ఎత్తివేయడం వల్ల హెచ్​-1బీ వీసా రెన్యూవల్‌ చేయించుకోవాలంటే సంబంధిత వ్యక్తులు స్వదేశంలోని అమెరికా కాన్సులేట్‌కు వెళ్లాల్సి వచ్చేది. వీసా వెయిటింగ్‌ కాలం 800 రోజులు లేదా రెండేళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు విదేశీ సాంకేతిక నిపుణులకు చాలా అసౌకర్యంగా ఉండేది. పైలెట్‌ ప్రాజెక్టు పూర్తిగా అమలు చేస్తే వేలాది మంది సాంకేతిక నిపుణులకు ప్రయోజనం కలగనుంది.

ఏళ్ల తరబడి నిరీక్షణ..అమెరికాకి వెళ్లాలని కలలు కనేవారు హెచ్​-1బీ వీసా జారీ ప్రక్రియలో జాప్యం కారణంగా ఏళ్ల తరబడి వారి స్వదేశంలోనే చిక్కుకుపోవాల్సి వస్తోంది. ప్రత్యేకించి ఈ వీసాల జారీ కోసం 800 రోజులు లేదా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇది అటు కంపెనీలతో పాటు టెక్​ నిపుణులకు కాస్త అసౌకర్యంగా మారింది.

కమిటీ సిఫార్సు మేరకు..సిలికాన్ వ్యాలీకి చెందిన అజయ్ జైన్ భూటోరియా యూఎస్ సిటిజన్​షిప్​ ఇమ్మిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​) ద్వారా అమెరికాలోనే హెచ్​-1బీ, ఎల్1 వీసాల పునరుద్ధరించాలని సంబంధిత శాఖకు సిఫార్సు చేశారు. అలాగే హెచ్​-1బీ, ఎల్1 వీసాల పునరుద్ధరణ ప్రక్రియకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అజయ్ జైన్ నేతృత్వంలో కమిటీ ఈ సిఫార్సులను ప్రభుత్వానికి చేసింది.

హెచ్​-1బీ వీసా ఎవరికి ఇస్తారు..?
అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. హెచ్​-1బీ వీసా అనేది ఒక నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసాకు మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details