తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌండ్ చేయొద్దన్నందుకు పక్కింటి వారిపై కాల్పులు.. చిన్నారి సహా ఐదుగురు మృతి - పక్కింటి వారిపై కాల్పులు జరిపిన దుండగుడు

అమెరికాలో దారుణం జరిగింది. శబ్దం చెయ్యొద్దు అన్నందుకు.. పక్కింటి వారిపై కాల్పులు జరిపాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు.

america-shooting-several-people-killed-in-shooting-at-home-in-america
పక్కింట్లో వారిని కాల్చి చంపిన దుండగుడు

By

Published : Apr 29, 2023, 8:14 PM IST

Updated : Apr 29, 2023, 8:37 PM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పక్కింట్లో ఉన్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెరట్లో కాల్పులు శబ్దం చేస్తున్న నిందితుడిని ఆపమన్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాల్పులు చేస్తుంటే ఎలా నిద్రపోవాలి అన్న పాపానికి.. ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాడు. అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఈ ఘటన జరిగింది.

శనివారం రాత్రి ఈ దారుణం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. నిందితుడ్ని ఇంకా గుర్తించలేదని వారు వెల్లడించారు. హ్యూస్టన్‌ నగరానికి ఉత్తరాన 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లీవ్‌ల్యాండ్ పట్టణంలో ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితుడికి 39 ఏళ్ల ఉంటాయన్న అధికారులు.. అతడి కోసం ఇంకా గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇంట్లో మొత్తం పది మంది ఉన్నారని అధికారులు తెలిపారు. మిగతా వారికి ఎలాంటి గాయాలు కాలేదని వారు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు.. ఓ పురుషుడు ఉన్నాడని పేర్కొన్నారు. వారి వయస్సు 8 నుంచి 40 సంవత్సరాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఒకే కుటుంబంలో 10 మంది..
వారం రోజుల క్రితం దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్​లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఓ బాలుడు సహా ఇద్దరు పురుషులు ఉన్నారు. తూర్పు క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని పీటర్​మారిట్జ్‌బర్గ్ నగరంలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. చనిపోయిన వారిలో 13, 65 ఏళ్ల వ్యక్తులు కూడా ఉన్నారు. నలుగురు దుండగులు కాల్పులు జరిపిన అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనుమానితుడు ఒకరు మరణించారు. మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ నిందితుడు గాయపడగా.. మరో నిందితుడు పరారయ్యాడు. చనిపోయిన నిందితుడు ఇంతకుముందు అనేక కేసుల్లో నేరస్థుడిగా ఉన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి

టీనేజర్​ బర్త్​డే పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు..
రెండు వారాల క్రితం.. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ టీనేజర్​ బర్త్​డే వేడుకల్లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. రాత్రి 10:30 గంటల సమయంలో అలబామాలోని డాడెవిల్లేలో ఈ కాల్పులు జరిగాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి స్టేషన్ మహోగని మాస్టర్ పీస్ డ్యాన్స్ స్టూడియోలో జరుగుతున్న పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న గన్​తో షూట్​ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి

Last Updated : Apr 29, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details