తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే నేనూ చేయను!- కానీ ఆయన్ను మాత్రం గెలవనివ్వం' - ఒక్క రోజే నియంతగా ఉంటానన్న ట్రంప్

America Presidential Election Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీలో లేకపోతే.. తాను కూడా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు.

America Presidential Election Biden
America Presidential Election Biden

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 6:41 PM IST

America Presidential Election Biden :అగ్రరాజ్యంఅమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రచారానికి నిధుల సేకరిస్తున్న వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికల బరిలో లేకపోతే తాను కూడా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు. కానీ ఈ దేశం కోసం ఆయన్ను మాత్రం గెలవనివ్వమన తెలిపారు.

అయితే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచిన జో బైడెన్‌కు అమెరికా ఓటర్లు మరోసారి అధికారాన్ని కట్టబెడతారా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో బైడెన్‌ వయసు కీలకాంశం కానుంది. ఆయన రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి అయ్యేనాటికి 86 ఏళ్లకు చేరుకోనున్నారు.

'ఒక్కరోజే నియంతగా ఉంటా'
మరోవైపు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ గెలిస్తే అమెరికా నిరంకుశ పాలనలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై తాజాగా స్పందించారు ట్రంప్‌. 'నేను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే నియంతగా మారను. కానీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు మాత్రం నియంతగా ఉంటాను' అని వ్యాఖ్యానించారు. ఆ మొదటి రోజు మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయించేందుకు, చమురు డ్రిల్లింగ్‌ను విస్తరించడానికి తన అధ్యక్ష అధికారాలను ట్రంప్​ ఉపయోగించొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే బైడెన్​, ట్రంప్​ ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించారు.

డోనాల్డ్ ట్రంప్​ వైపు మొగ్గు చూపుతున్న ఓటర్లు సర్వేలో వెల్లడి
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు మాజీ డొనాల్డ్ ట్రంప్​ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవలే ఓ పోల్​లో తేలింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కంటే బైడెన్​ 10 పాయింట్లు వెనకబడినట్లు వాషింగ్టన్ పోస్ట్‌, ABC న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన పోల్‌ కొద్దిరోజుల క్రితం వెల్లడించింది. 51-42 తేడాతో బైడెన్‌ కంటే ట్రంప్‌ ముందున్నట్లు ఆ పోల్ పేర్కొంది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో మిగిలినవారి కంటే ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు.పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Vivek Ramaswamy Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ రామస్వామి జోరు.. ట్రంప్ తర్వాత స్థానంలో మనోడే!

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ సంచలన ప్రకటన.. మరోసారి రంగంలోకి..

ABOUT THE AUTHOR

...view details