తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​కు అమెరికా యుద్ధ విమానాలు.. బైడెన్ కీలక నిర్ణయం - అమెరికా ఉక్రెయిన్ న్యూస్

America Help Pakistan : పాకిస్థాన్​కు 450 మిలియన్ల డాలర్ల సహాయం అందించేందుకు బైడెన్ సర్కారు ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్‌-16 ఫైటర్ జెట్లను పాక్​కు అందించనుంది అమెరికా. మరోవైపు ఉక్రెయిన్​, ఐరోపా దేశాలకు 2 బిలియన్ల డాలర్ల సాయం ప్రకటించారు యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్.

america help pakistan
పాక్​కు అమెరికా సాయం

By

Published : Sep 8, 2022, 4:09 PM IST

America Help Pakistan : దాయాది దేశం పాకిస్థాన్‌కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్‌ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్‌-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్లలో మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆమోదం తెలిపారు.

450 మిలియన్ల డాలర్ల అంచనా వ్యయంతో ఎఫ్‌-16 యుద్ధవిమానాలను విదేశీ సైనిక విక్రయానికి ఆమోదిస్తూ యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత విక్రయం గురించి కాంగ్రెస్‌కు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమకు పాక్‌ ఒక ముఖ్య భాగస్వామి అని పేర్కొంది. ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో భద్రతాపరమైన సమతౌల్యానికి ఎలాంటి హాని ఏర్పడదని చెప్పింది. ఇదిలా ఉంటే.. 2018లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాకిస్థాన్‌కు రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని నిలిపివేశారు. అఫ్గాన్‌ తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్‌ వంటి ఉగ్ర గ్రూపులను నిలువరించడంలో విఫలమవుతుందంటూ ఆ సహకారాన్ని ఆపేశారు. అలాగే ఉగ్రవాదంపై పోరాటంలో పాక్‌ తమ భాగస్వామి కాదని ఆ సందర్భంగా పేర్కొన్నారు.

మరోవైపు.. ఉక్రెయిన్​, ఐరోపా దేశాలకు అమెరికా 2 బిలియన్ల డాలర్లు సాయం చేయనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ప్రకటించారు. రష్యా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సహా మరో 18 పొరుగు దేశాలకు సైనిక సహాయాన్ని అందించనున్నట్లు బ్లింకెన్ తెలిపారు. అంతకుముందు జర్మనీలో జరిగిన ఓ సమావేశంలో 675 మిలియన్ల డాలర్లను.. ఉక్రెయిన్​కు ఆయుధాల కొనుగోలు కోసం అందిస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్ ప్రకటించారు.

ఇవీ చదవండి:ఫేస్​బుక్​లో లైవ్​ ఇస్తూ కాల్పులు.. కారులో ఊరంతా తిరుగుతూ దాడులు.. నలుగురు మృతి

పార్లర్‌లో అగ్ని ప్రమాదం- 32 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details