Donald Trump Indictment : వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగాలని చూస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్నకు షాక్ తగిలింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని తిప్పిగొట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌బీఐ).. క్రిమినల్ కేసు నమోదు చేసింది. అలాగే ఎన్నికల యంత్రాలను స్వాధీనం చేసుకోవడం, ట్యాంపరింగ్ ఆరోపణలపై ట్రంప్ సన్నిహితుడిపై క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసులో ట్రంప్‌పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్ స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ మంగళవారం ఆదేశించారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు అధికారులు న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. రహస్య పత్రాల తరలింపు కేసు, పోర్న్‌స్టార్ స్టార్నీ డేనియల్స్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గతంలోనే కేసులు నమోదయ్యయి. 2020లో ట్రంప్ మద్దతుదారులు వైట్‌హౌస్‌పై దాడి కేసులో ఆయనపై అభియోగాలున్నాయి. అలాగే ఆ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని తిప్పిగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలపై తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ట్రంప్.. గురువారం కోర్టును హాజరుకావాలని ఆదేశించింది.
మరోవైపు తనపై వచ్చిన అభియోగాలపై ట్రంప్ స్పందించారు. '2024 అధ్యక్ష ఎన్నికలలో నా పోటీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాపై మరో నకిలీ కేసును పెడతారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఎందుకు 2020 అధ్యక్ష ఎన్నికల ఘటనపై కేసు నమోదు చేయలేదు. ఎందుకు ఇంత కాలం వేచి ఉన్నారు.' అని తన సోషల్ మీడియో ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
రహస్య పత్రాల తరలింపు కేసు..
కొన్నాళ్ల క్రితం రహస్య పత్రాల తరలింపు కేసు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైంది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత శ్వేత సౌథం నుంచి వెళ్లిపోయేటప్పుడు.. రహస్య పత్రాలను ట్రంప్ తనతో తీసుకెళ్లారని ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో అమెరికా అణు కార్యక్రమ ప్రణాళికలు, అమెరికా సహా మిత్రదేశాలకు పొంచి ఉన్న సైనిక ముప్పు, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రచించిన ప్రణాళికల వంటి కీలక వివరాలు ఉన్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు.
గతంలో ట్రంప్ అరెస్ట్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు.. ఆమెతో అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న ట్రంప్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు న్యూయార్క్ మన్‌హటన్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.