Akshata Murthy: బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె.. అక్షతా మూర్తి పన్ను చెల్లింపుల వ్యవహారంపై బ్రిటన్‌లోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అక్షత బ్రిటన్‌లో తొమ్మిదేళ్ల నుంచి నివసిస్తున్నప్పటికీ ఆమె ఇప్పటికీ భారత పౌరురాలే. అందువల్ల ఇన్ఫోసిస్‌లో తనకున్న షేర్లు, వాటినుంచి వచ్చే ఆదాయంపై అక్షత బ్రిటన్‌లో పన్నులు చెల్లించనక్కర్లేదు. భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని ఆమోదించదు కాబట్టి ఆమె ఇప్పటికీ భారత్‌లో పన్నులు చెల్లిస్తున్నారు.
'ఇన్ఫీ నారాయణమూర్తి కుమార్తె.. బ్రిటన్‌లో పన్నెందుకు కట్టట్లేదు?' - akshata murthi
Akshata Murthy: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిపై బ్రిటన్‌లోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తొమ్మిదేళ్ల నుంచి బ్రిటన్‌లో ఉంటున్నా పన్ను చెల్లించట్లేరని ఆరోపిస్తున్నారు.
బ్రిటన్‌లో ఓ వెంచర్ క్యాపిటల్ కంపెనీ డైరెక్టర్ హోదాలో మాత్రం తనకు లభించే ఆదాయంపై బ్రిటన్‌లోనే ఆమె పన్నులు చెల్లిస్తున్నారని కంపెనీ ప్రతినిధి చెప్పారు. గత నెలలో సునక్ సమర్పించిన మినీ బడ్జెట్‌లో ప్రజలపై ఎడాపెడా పన్నులు వేశారనీ, ఆయన భార్య మాత్రం ఇక్కడ పన్నులు చెల్లించకుండా భారత్‌లో చెల్లిస్తున్నారని విమర్శించాయి. తన మామయ్య నారాయణమూర్తిని చూసి తాను ఎంతో గర్విస్తున్నాననీ, ఎవరు ఎంతగా బురదజల్లినా ఆయనపై తన గౌరవం తగ్గదని సునక్ ఉద్ఘాటించారు.
ఇదీ చూడండి :'ముద్దులు వద్దు.. బాల్కనీలోకి రావద్దు'.. డ్రోన్లు, రోబోలతో చైనా వార్నింగ్స్!