తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో తాలిబన్ల పాలనకు రెండేళ్లు.. రోడ్డున పడ్డ లక్షల కుటుంబాలు.. 60వేల మంది మహిళల జీవితాలు.. - afghanistan financial sanctions

Afghanistan Taliban Takeover : అఫ్గాన్‌లో ఆటవిక పాలన మొదలై రెండేళ్లైంది. అధికారం చేపట్టాక కొన్ని కఠిన పాలనా విధానాలకు స్వస్తి చెప్పి.. ఆధునిక పాలనవైపు అడుగేస్తామన్న తాలిబన్లు.. వాగ్ధానం మరిచి.. అరాచక పాలన వైపే సాగుతున్నారు. ఈ రెండేళ్లలో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు చేసిందేంటి? అఫ్గాన్ల జీవితాల్లో వచ్చిన మార్పులేంటి? ఆ దేశ ఆర్థికం ఎలా సాగుతోందన్న విషయాలను తెలుసుకుందాం.

Afghanistan Taliban Takeover
Afghanistan Taliban Takeover

By

Published : Aug 16, 2023, 6:55 AM IST

Afghanistan Taliban Takeover : అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికార పీఠంపై కూర్చుని రెండేళ్లయింది. ఈ సందర్భంగా తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. తాలిబన్ల పాలనలో తమ జీవితాలెలా ఉంటాయో ఊహించుకుని భయపడ్డ అఫ్గాన్ల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అరాచక పాలన సాగుతోంది. 2021 ఆగస్టులో అధికారం చేపట్టే ముందు తాలిబన్లు.. తాము మారిపోయామనీ, 1996 నుంచి 2001లో లాగా పాలన సాగించబోమని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగానే పాలన సాగుతోంది. రెండేళ్లయినా అఫ్గాన్‌లో పూర్తిస్థాయిలో శాంతి నెలకొనలేదు. ఇంకా అతివాద మిలిటెంటు గ్రూపులు అక్కడ దాడులు చేస్తూనే ఉన్నాయి.

60వేల మంది మహిళల జీవితాలు..
Afghanistan Taliban Rules And Regulations : తాలిబన్ల పాలనలో ప్రజలకు ఉపాధి లేదు. నిరుద్యోగం ప్రబలింది. సంప్రదాయ పాలన పేరుతో స్త్రీల వస్త్రధారణ, బ్యూటీ రంగాలపై ఆంక్షలు పెట్టడం వల్ల చాలా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. దేశంలో ఈ రంగాలను నమ్ముకున్న లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బ్యూటీపార్లర్లపై నిషేధంతో 60వేల మంది మహిళల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి.

తీవ్ర మానసిక సంఘర్షణకులోనై..
Afghanistan Taliban Rules For Females : వ్యాపారరంగంతో పాటు ఉద్యోగిణులను ఇంటికి పంపేశారు. ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాలు ఒక్కసారి ఊడిపోవడం వల్ల మహిళలు.. తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయినట్లు పలు సంస్థలు తెలిపాయి. మహిళా విద్యను నిషేధించారు. 12 ఏళ్లు దాటిన బాలికలను పాఠశాలలకు దూరం చేశారు. మొదట్లో అఫ్గాన్‌ మహిళలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమించినా..తాలిబన్లు దారుణంగా అణచివేశారు. సామూహికంగా కొరడాలతో కొట్టే కఠిన శిక్షలు విధించారు. ఈ రెండేళ్లలో కొన్ని నేరాలకు రాళ్లతో కొట్టడం వంటి శిక్షలను తాలిబన్లు సమర్థించినట్లు సమాచారం. ఇప్పుడు మహిళలు ఇంటి నుంచి కాళ్లు బయటపెట్టేందుకే భయపడుతున్నట్లు కథనాలు వెలుగు చూశాయి. ప్రజల పాప పుణ్యాలు లెక్కించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాడింది.

పెట్టుబడులు రాక ఆర్థిక వ్యవస్థ కుదేలు..
Afghanistan Financial Crisis :అరాచక పాలన చూసిన ఇతర దేశాలు.. అఫ్గాన్‌కు నిధులను నిలిపివేశాయి. మహిళలను పనులకు దూరం చేయడం వల్ల అనేక స్వచ్ఛంద సంస్థలు అక్కడ కార్యకలాపాలను తగ్గించాయి. భద్రతాలేమితో పెట్టుబడులు రాక ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించని దేశాలు ఆ దేశానికి సాయాన్ని నిరాకరిస్తున్నాయి. విదేశాల్లోని అఫ్గానిస్థాన్‌ ఆస్తులను దేశాలు స్తంభింపజేశాయి. మొత్తానికి తాలిబన్ల పాలన ఆ దేశాన్ని శతాబ్ధాల వెనక్కు తీసుకెళుతోంది. ఈ రెండేళ్లలో అక్కడ నష్టపోయింది అందరికన్నా ఎక్కువ మహిళలు, బంగారు భవిష్యత్‌ ఉన్న చిన్నారులే.

ABOUT THE AUTHOR

...view details