అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి చెందారు. దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్టీ ప్రకారం కాబుల్‌లోని దౌత్య కార్యాలయం బయట సోమవారం.. ఈ పేలుడు జరిగింది. కాబుల్‌లోని దారుల్‌మాన్ రోడ్డులోని ఈ కార్యాలయం వద్ద వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారి పేర్లను పిలిచేందుకు దౌత్యవేత్త బయటకు వచ్చిన సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఒక వ్యక్తి బాంబును శరీరానికి ధరించి వచ్చి పేల్చుకొన్నట్లు అనుమానిస్తున్నారు.
ఆత్మాహుతి దాడి.. ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి
14:03 September 05
ఆత్మాహుతి దాడి.. ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి
ఈ ఘటనలో ఇద్దరు దౌత్య సిబ్బంది కూడా చనిపోగా.. మరో దౌత్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డు గాయపడినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌లో దౌత్య కార్యాలయం నిర్వహిస్తున్న అతికొద్ది దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ దాడిపై తాలిబన్లు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు దాడికి బాధ్యత తీసుకోవడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. అమెరికన్లు అఫ్గాన్ గడ్డపై నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడులు చేస్తోంది. ఈ సంస్థ లక్ష్యాల్లో తాలిబన్లే ఎక్కువగా ఉంటున్నారు.
ఇవీ చదవండి:చైనా, అఫ్గాన్‌ను అతలాకుతలం చేసిన భూకంపం..
కెనడాలో వరుస కత్తి దాడులు.. ఆ వర్గమే టార్గెట్.. 10 మంది మృతి