అఫ్గానిస్థాన్‌లో భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విపత్కర పరిస్థితిలో అఫ్గాన్‌కు భారత్ అండగా ఉంటుందని, విపత్తు సాయం అందిస్తుందని చెప్పారు.
భారీ భూకంపం.. వందలాది మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి
21:38 June 22
14:52 June 22
అఫ్గానిస్థాన్ భూకంపంలో కనీసం 920 మృతి చెంది ఉంటారని ఆ దేశ అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు. మరో 600 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మొదట 255 మంది మృతి చెందినట్లు అంచనా వేసినప్పటికీ ఆ సంఖ్య భారీగా పెరిగింది.
10:50 June 22
భారీ భూకంపం..
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు అప్గానిస్థాన్‌లోని పక్టికా ప్రావిన్స్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 255 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా సంస్థ బఖ్తర్ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6గా నమోదైనట్లు పేర్కొంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. హెలీకాప్టర్లలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుంటున్నారని తెలిపారు. సుమారు 90 ఇళ్లకు పైగా ధ్వంసమయ్యాయని, చాలా మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు.
"భారీ భూకంపం పక్టికా ప్రావిన్స్‌లోని నాలుగు ప్రాంతాలపై ప్రభావం చూపింది. ఈ ఘటనలో వందలాది మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు" అని తాలిబన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరీమి ట్వీట్ చేశారు.
పాకిస్థాన్‌లోనూ భూ ప్రకంపనలు..
మరోవైపు, పాకిస్థాన్‌లోనూ పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, పంజాబ్ ప్రావిన్స్‌లలో పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ ఘటనల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పాక్ అధికారులు తెలిపారు.