తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​ స్కూల్​లో బాంబు దాడి.. 16 మంది విద్యార్థులు మృతి - Afghanistan religious school bomb blast

అఫ్గానిస్థాన్​లోని ఓ పాఠశాలపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు చనిపోయారు.

AFGHAN-BOMBING
AFGHAN-BOMBING

By

Published : Nov 30, 2022, 4:41 PM IST

Updated : Nov 30, 2022, 5:23 PM IST

అఫ్గానిస్థాన్​లో దారుణం జరిగింది. ఓ మతపరమైన పాఠశాలపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు మరణించారని తాలిబన్ అధికారులు తెలిపారు. మరో 14 మంది గాయపడ్డారని వివరించారు. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో పేలుడు జరిగిందని వెల్లడించారు.

సమాంగన్ రాష్ట్ర రాజధాని అయ్బక్​లో ఈ దాడి జరిగిందని అఫ్గాన్ హోంమంత్రి అబ్దుల్ నఫీ టకోర్ తెలిపారు. ఈ ఘటనకు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. అఫ్గాన్​లో తాలిబన్లు అధికారం కైవసం చేసుకున్న తర్వాత తరచుగా బాంబు దాడులు జరుగుతున్నాయి.

Last Updated : Nov 30, 2022, 5:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details