Taliban Rules in Afghan: అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజలపై తాలిబన్లు ఆంక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలికల విద్య, మహిళలు స్వేచ్ఛగా బయటకు రావడంపై తాలిబన్ల ఆంక్షలు ఎక్కువయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళా టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలకు ఉపక్రమించారు. వార్తల ప్రసారం సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని హుకుం జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
టీవీ యాంకర్లూ ముఖాలు కప్పుకోవాల్సిందే : తాలిబన్ల హుకుం - international news
Afghan Taliban: అఫ్గానిస్థాన్‌లో మహిళా టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలకు ఉపక్రమించారు. వార్తల ప్రసారం సమయాల్లో మహిళా యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని హుకుం జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Taliban News: అయితే, తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ, వాటిపై బహిరంగంగా చర్చించే పరిస్థితి గానీ లేదని అఫ్గాన్‌కు చెందిన టోలో న్యూస్ అభిప్రాయపడింది. ఇటువంటి ఆదేశాలే దేశంలోని అన్ని టీవీ, రేడియో నెట్‌వర్క్ సంస్థలకు వెళ్లినట్లు తెలిపింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళా యాంకర్లు ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఇదీ చదవండి:తర్వాతి ఎన్నికల్లో ట్రంప్‌కే ఓటేస్తా!: మస్క్