తెలంగాణ

telangana

ETV Bharat / international

వివాహేతర సంబంధమా? ఇక కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా తథ్యం! - నూతన ముసాయిదా చట్టం

వివాహేతర సంబంధం, పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం, సహజీనవం వంటి వాటిని నిషేధించేందుకు ఇండోనేసియా నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. వీటితోపాటు మరికొన్ని నిబంధనలతో కూడిన నూతన చట్టాన్ని మంగళవారం జరిగిన పార్లమెంట్​ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఆమోదించారు.

Adultery a punishable offense in Indonesia
Adultery a punishable offense in Indonesia

By

Published : Dec 6, 2022, 1:26 PM IST

Indonesia Premartial Sex : వివాహేతర సంబంధం, పెళ్లికి ముందు శృంగారంతో పాటు సహజీవనాన్ని నిషేధించేందుకు ఇండోనేసియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదా సంస్థలను కించపరిచే వ్యాఖ్యలపైనా ఆంక్షలు విధించింది. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే ఏడాదిపాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించనుంది. ఇందుకోసం రూపొందించిన నూతన చట్టాన్ని ఇండోనేసియా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన క్రిమినల్‌ కోడ్‌ ముసాయిదాను మంగళవారం జరిగిన పార్లమెంట్​ సమావేశంలో అధిక మెజార్టీతో అంగీకరించారు. ఈ విషయాన్ని దేశ ఉప న్యాయశాఖ మంత్రి ఎడ్వార్డ్‌ ఒమర్‌ షరీఫ్‌ హియారిజ్‌ వెల్లడించారు. దీనిపై ఇంకా దేశ అధ్యక్షుడు సంతకం చేయవలసి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పాత చట్టం నుంచి కొత్త చట్టానికి మారడానికి దాదాపు 3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు.

'పెళ్లికి ముందు శృంగారం, సహజీవనం చేయడం నిషేధం. భార్య లేదా భర్త లేనివారితోనూ ఎవరైనా శృంగారంలో పాల్గొంటే, వారిని వ్యభిచారం కింద శిక్షిస్తాం. కేటగిరి-2 కింద గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఉంటుంది' అని చట్టంలో పేర్కొంది ప్రభుత్వం. ఇండోనేసియా పౌరులతోపాటు విదేశీయులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇదే విషయంపై మాట్లాడిన దేశ ఉప న్యాయశాఖ మంత్రి ఎడ్వార్డ్‌ ఒమర్‌ షరీఫ్‌ హియారిజ్‌.. ఇండోనేసియా విలువలకు తగినట్లుగా కొత్త చట్టం ఉండటం తమకెంతో గర్వకారణమని అన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేసియా.. మహిళలు, మతపరమైన మైనారిటీలు, స్వలింగ సంపర్కులపై ఎన్నో ఆంక్షలు విధిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ.. స్థానిక విలువలకు అనుగుణంగా నేర నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఈ దేశం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రూపొందించిన నూతన చట్టం.. 2019లోనే ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, దీనిపై జాతీయస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కొత్త చట్టం.. పౌర స్వేచ్ఛను అణచివేసేలా ఉందని వేల మంది ఆందోళనలకు దిగారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం.. ప్రజలతో సంప్రదింపులు జరిపి, కొన్ని మార్పులతో ఈ నూతన చట్టాన్ని ఆమోదించింది.

ABOUT THE AUTHOR

...view details