తెలంగాణ

telangana

ETV Bharat / international

గర్భ విచ్ఛిత్తికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన వేలాది మంది

గర్భ విచ్ఛిత్తిని చట్టవ్యతిరేకమైన చర్యగా పరిగణించాలంటూ అర్జెంటీనా వాసులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

By

Published : Mar 24, 2019, 10:42 AM IST

గర్భవిచ్ఛిత్తి

గర్భవిచ్ఛిత్తి చట్టవిరుద్ధమని ప్రకటించాల్సిందే
గర్భ విచ్ఛితి(అబార్షన్​)ని వ్యతిరేకిస్తూ "ఇన్ డిఫెన్స్ ఆఫ్ టూ లైవ్స్​" పేరిటఅర్జెంటీనాలో ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. రాజధాని బ్యూనస్​ ఏర్స్​లో వేల సంఖ్యల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

ప్రాణం అనేది ప్రకృతికి సంబంధించిన విషయం. ఇదొక ప్రజా ఉద్యమం. అన్ని మతాల వారు ఈ నిరసనలో పాల్గొన్నారు. గర్భ విచ్ఛిత్తికి మేము వ్యతిరేకం. పార్లమెంట్​ సభ్యులకు ఈ విషయం తెలిసేలా చేస్తాం.-కార్లొస్​ లొరెన్జ్​, నిరసనకారుడు

గర్భ విచ్ఛిత్తికి చట్టబద్ధత కల్పించేందుకు 2018లో బిల్లు ప్రవేశపెట్టింది అర్జెంటీనా ప్రభుత్వం. దిగువ సభ ఆమోదం పొందిన ఆ బిల్లు... ఎగువసభలో తిరస్కరణకు గురైంది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ బిల్లును సమర్థిస్తూ గత నెలలో వేలాది మంది బ్యూనస్​ ఏర్స్​లో ఆందోళనకు దిగారు. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మరో వర్గం నిరసన చేపట్టింది.

ప్రస్తుతం అర్జెంటీనాలో అత్యాచార కేసులు లేదా గర్భం వల్ల మహిళ ప్రాణాలకు హానీ ఉన్న సందర్భాల్లోనే గర్భవిచ్ఛితికి అనుమతి ఉంది.

ABOUT THE AUTHOR

...view details