ఇంటిపై కూలిన యుద్ధ విమానం- ఇద్దరు పైలెట్లు మృతి - రష్యా ఉక్రెయిన్ యుద్ధం
రష్యాకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం సైబీరియాలోని ఓ నివాస భవనంపై క్రాష్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు చనిపోయారు.
russian plane crash
రష్యాకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం.. సైబీరియాలోని ఓ నివాస భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృత్యువాతపడ్డారు. ఇర్కుట్స్‌లోని రెండతస్తుల భవనంపై యుద్ధ విమానం కూలిపోయినట్లు సైబీరియాలోని రష్యా అత్యవసర విభాగ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రమాద సమయంలో భవనంలో రెండు కుటుంబాలు ఉన్నట్లు చెప్పింది. అయితే పైలెట్లు మినహా ఘటనాస్థలిలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని స్పష్టం చేసింది. ప్రమాదానికి గురైన సుఖోయి-30 శిక్షణా విమానమని రష్యా మంత్రిత్వశాఖ వివరించింది.
Last Updated : Oct 23, 2022, 7:04 PM IST