తీర్థయాత్రలకు వెళ్లి తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రం టిలా అనే ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ప్రయాణికులు కార్పస్ క్రిస్టీ ఈవెంట్‌కు హాజరై ఇంటికి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన దర్యాప్తు చేపడుతున్నామని.. బస్సు అదుపు తప్పడమే ఈ దుర్ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతిచెందిన వారు టబాస్కో ప్రాంతానికి చెందినవారని తెలిపారు. మరోవైపు గాయపడిన 40 మందిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు నటులు
మెక్సికోలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సినీ నటులు కూడా ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ది చోసెన్ వన్‌లో వీరు నటిస్తున్నారు.
నటులు దుర్మరణం: మెక్సికోలోనే మరో విషాదం వెలుగుచూసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'ది చోసెన్ వన్' వెబ్‌సిరీస్‌కు చెందిన ఇద్దరు నటులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ములిగే నగరం సమీపాన జరిగిన ఈ ప్రమాదం వ్యాన్ అదుపుతప్పడం వల్లే జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు.. రేమండో గార్డునో క్రూజ్, జూవాన్ ఫ్రాన్సిస్కో గొన్జాలేజ్ అగ్విలర్గా గుర్తించారు.
ఇదీ చూడండి :పాకిస్థాన్‌లో ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం