తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇండోనేసియాలో భారీ భూకంపం.. గజగజ వణికిన ఆస్ట్రేలియా - international news

తూర్పు ఇండోనేసియాలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని వల్ల అక్కడి ఇళ్లు, భవనాలతో పాటు రెండు పాఠశాలలు ధ్వంసమయ్యాయి. ఒకరికి గాయాలయ్యాయి.

7.6 magnitude earthquake hits eastern Indonesia
ఇండోనేసియాలో 7.6తీవ్రతతో భూకంపం

By

Published : Jan 10, 2023, 7:06 PM IST

Updated : Jan 10, 2023, 8:28 PM IST

మంగళవారం తెల్లవారుజామున తూర్పు ఇండోనేసియాలోని తనింబర్ దీవులలో 7.6తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫలితంగా 5సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. దీని వల్ల అక్కడి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఒకరు గాయపడ్డారు. తనింబర్, మలుకు జిల్లాల్లో రెండు పాఠశాల భవనాలు, 124 ఇళ్లు దెబ్బతిన్నాయని నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ తెలిపింది. దీని ప్రభావం పపువా, తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లతో పాటు జకార్తా, ఉత్తర ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలలో కనిపించింది.

తూర్పు ఇండోనేసియాలోని 127,000 మంది నివాసితులు ఉన్న తనింబార్ దీవులకు సమీపంలోని బండా సముద్రంలో 7.6 తీవ్రతతో భారీగా భూమి ప్రకంపించింది. దీని వల్ల అక్కడి సమీపంలోని భవనాలన్నీ ధ్వంసమయ్యాయి. తనింబర్ దీవులు, మలుకు జిల్లాల్లోని రెండు పాఠశాల భవనాలు, 124 ఇళ్లు దెబ్బతిన్నాయన్నాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగనప్పటికీ.. ఒకరికి గాయాలయ్యాయి. మూడు నుంచి ఐదు సెకన్ల పాటు బలంగా భూమి ప్రకంపించిందని స్థానికులు చెప్పారు.

ఆస్ట్రేలియా, జకర్తాపై భూకంప ప్రభావం:
తనింబార్ దీవులకు సమీపంలోని బండా సముద్రంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించడం వల్ల ఇండోనేసియాతో పాటు పాపువా, తూర్పు నుసా, టెంగ్‌గారా ప్రావిన్స్‌లతో పాటు జకర్తా, ఉత్తర ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించిన 3గంటల తర్వాత ఇండోనేసియా వాతావరణ శాఖ సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఆస్ట్రేలియాకు ఉత్తరంవైపు 105 కిలోమీటర్ల (65 మైళ్లు) లోతులో భూకంపం ఏర్పడిందని యూఎస్​ జియోలాజికల్ సర్వే తెలిపింది. లోతైన భూకంపాలు తక్కువ ఉపరితల నష్టాన్ని కలిగిస్తాయని.. కానీ విస్తృతంగా భూకంప ప్రభావాన్ని కలిగిస్తాయని పేర్కొంది.

Last Updated : Jan 10, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details