Mexican cartel violence: మెక్సికోలో డ్రగ్స్ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఉత్తర మెక్సికోలోని న్యువో లియోన్‌లో పోలీసులపై భారీ ఆయుధాలతో దాడి చేసింది. ఈ దాడిలో మహిళా పోలీసు సహా ఆరుగురు మరణించగా.. నలుగురికి గాయాలయ్యాయి. నగరంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా దుండగులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారని అధికారులు తెలిపారు. నిందితులతో పోలీసులు వీరోచితంగా పోరాడారని చెప్పారు. ప్రస్తుతానికి నిందితులపై స్పష్టత లేదని.. కానీ ఈ ప్రాంంతంలో జెటాస్ కార్టెల్ డ్రగ్స్ ముఠా విధ్వంసం సృష్టిస్తోందన్నారు. ఓల్డ్ జెటాస్ కార్టెల్ డ్రగ్స్ ముఠా గత దశాబ్దంలో విధ్వంసం సృష్టించగా.. కొద్ది కాలంగా స్తబ్దుగా ఉంది. కానీ ఈ ఏడాది కాలంలో మళ్లీ విధ్వంసం సృష్టిస్తోంది.
బుల్‌ఫైట్‌లో కుప్పకూలిన స్టాండ్.. నలుగురు మృతి.. వందల మందికి గాయాలు - మెక్సికో కాట్రెల్ న్యూస్
Mexican cartel violence: డ్రగ్స్ గ్యాంగ్ చేసిన మెరుపుదాడిలో ఆరుగురు పోలీసులు మరణించగా..నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని న్యువో లియోన్‌లో జరిగింది. మరో ఘటనలో కొలంబియాలో ఎద్దుల పోటీలను చూస్తుండగా.. స్టాండ్ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు.
బుల్‌ఫైట్‌లో స్టాండ్ కూలిపోయి..కొలంబియాలోని ఎస్పినాల్ నగరంలో జరిగిన ఎద్దుల పోటీలో అపశ్రుతి జరిగింది. పోటీలను తిలకించేందుకు మైదానంలో ఏర్పాటు చేసిన 3 అంతస్తుల స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడినట్లు నిర్వాహకులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు, 18 నెలల చిన్నారి ఉన్నట్లు వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో స్టాండ్స్‌లో 800 మంది వీక్షకులు ఉన్నారని తొలిమా గవర్నర్‌కార్లొస్ తమాయో తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కొర్రాలెజా అనే సంప్రదాయ క్రీడలు జరుగుతున్న సమయంలో దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి క్రీడలను నిషేధించాలని మేయర్లకు అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ హెచ్చరించారు. గతంలోనూ ఈ రకమైన పోటీల వల్ల ప్రమాదాలు జరిగాయాని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పరీక్షలు అయిపోయాయని విద్యార్థుల పార్టీ.. 21 మంది మృతి!