ఇంట్లో పని ఉందని, అందుకు సాయం చేయాలని చెప్పి బాలుడికి వల వేసింది ఓ మహిళ. అతడిపై ఉన్న వ్యామోహంతో ఇంటికి పిలుచుకొని శారీరక సంబంధం ఏర్పర్చుకుంది. చుట్టుపక్కల వారంతా వారిద్దరిని తల్లీకుమారులని భావిస్తుండగా.. ఆ మహిళ గర్భం దాల్చడం వల్ల గుట్టురట్టైంది. అమెరికాలో జరిగిందీ ఘటన.
కొలరాడో రాష్ట్రంలో ఉండే ఆండ్రియా సెరానో (31) అనే మహిళకు తన పొరుగున ఉండే 13 ఏళ్ల అబ్బాయి అంటే ఇష్టం. అతడిపై వ్యామోహం పెంచుకున్న ఆండ్రియా.. తరచుగా ఇంటికి పిలిచేది. ఇంటి పనుల్లో సహాయం చేయాలంటూ కోరేది. చివరకు వీరిద్దరూ ఒకే ఇంట్లో నివసించడం ప్రారంభించారు. నెలల పాటు కలిసి ఉన్నారు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. శారీరక బంధం బలపడింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలుడిని కోరింది ఆండ్రియా.
బయటివారంతా వీరిద్దరూ తల్లీకుమారులు అని భావించారు. అంతా సవ్యంగా జరుగుతోందని అనుకుంటుండగానే.. ఆండ్రియా గర్భం దాల్చింది. ఇక అంతా షాక్. ఆ బాలుడితో ఆండ్రియా లైంగిక సంబంధాలు నెరపుతోందని అందరికీ తెలిసిపోయింది. పోలీసులకూ దీని గురించి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగి.. ఆండ్రియాను అరెస్ట్ చేశారు. మైనర్‌పై లైంగిక దాడి చేసిందంటూ ఆరోపణలు మోపారు. అనేక వారాలుగా వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ కొనసాగుతోందని తేల్చారు.
ఇక ఈ కథ క్లైమాక్స్‌కు.. న్యాయస్థానం వేదికైంది. తమ మధ్య లైంగిక సంబంధం ఉన్న మాట వాస్తవమేనని కోర్టులో ఒప్పుకుంది ఆండ్రియా. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు.. ఆ బాలుడే తండ్రి అని కుండ బద్దలు కొట్టి చెప్పేసింది. అదే సమయంలో బాలుడితో ఆండ్రియా రాజీ కుదుర్చుకుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలోనని జడ్జీలు తలలు పట్టుకున్నారు. అయితే, మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆమెను విడుదల చేయడానికే మొగ్గు చూపారు న్యాయమూర్తి. 70వేల డాలర్ల (రూ.57లక్షలు) పూచీకత్తుతో ఆమెను విడుదల చేయాలని ఆదేశించారు. ఇరువురి మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో కేసును ముగించేందుకే కోర్టు ప్రయత్నించింది. పుట్టబోయే బిడ్డకు 13ఏళ్ల బాలుడే తండ్రిగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, బాలుడి కుటుంబం మాత్రం ఈ విషయంపై అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. బాలుడి తల్లి.. ఆండ్రియాపై నిప్పులు చెరిగింది. 'అమ్మ' అని పిలిచే బాలుడితో లైంగిక సంబంధం ఎలా పెట్టుకోవాలని అనిపించిందని నిలదీసింది. 'నా కుమారుడు ఆమెను ఎప్పుడూ అమ్మ అని పిలిచేవాడు. కానీ, ఆమె మాత్రం నా కుమారుడి జీవితాన్ని పాడు చేసింది. నా బిడ్డ యవ్వనాన్ని తుంచేసింది. అంత చిన్న వయసులో తండ్రి కావడం ఏంటి? ఇకపై వాడు తండ్రిలా బతకాలి. ఒకవేళ ఆండ్రియా నా కుమారుడి స్థానంలో ఉండి ఉంటే.. అప్పుడు కూడా ఇలాంటి న్యాయమే చేసేవారా?' అని బాలుడి తల్లి ప్రశ్నిస్తోంది.
కొలరాడోలోని సిటీ ఆఫ్ ఫౌంటెయిన్ పోలీసులు విడుదల చేసిన నిందితురాలి ఫొటో