తెలంగాణ

telangana

ETV Bharat / international

పోలీసు స్థావరంపై వేర్పాటువాదుల దాడి.. 19 మంది దుర్మరణం - ఇరాన్​లో అల్లర్లు

ఇరాన్​లో వేర్పాటువాదులు రెచ్చిపోయారు. పోలీసు స్థావరంపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 32 మంది గాయపడ్డారు.

Iran attack
ఇరాన్

By

Published : Oct 1, 2022, 7:51 PM IST

ఇరాన్‌లోని జహెదాన్‌లోని పోలీసు స్థావరంపై వేర్పాటువాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు సహా 19 మంది మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు. శుక్రవారం రోజున ప్రార్థనల పేరుతో మసీదులోకి ప్రవేశించిన దుండగులు.. సమీపంలోని పోలీసు స్థావరంపై దాడి చేశారని ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే ఘాతుకానికి పాల్పడిన వేర్పాటు వాద సంస్థలపై స్పష్టతనివ్వలేదు.

హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంగా పోలీసు కస్టడీలో మహ్సా అమిని అనే యువతి మృతి చెందినప్పటి నుంచి ఇరాన్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘర్షణల్లో ఇప్పటి వరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details