Mexico clandestine rooster fight: సెంట్రల్ మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. మిచోవాకాన్ రాష్ట్రంలో ఓ వేడుకను లక్ష్యంగా చేసుకొని దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది పురుషులు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆ ఘటనలో గాయపడిన మరికొంత మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అక్కడి స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం (ఎఫ్జీఈ) వెల్లడించింది. అయితే, కాల్పులకు గల కారణాలపై స్పష్టత లేదని.. దాడులకు పాల్పడిన వారికోసం ముమ్మర గాలింపు చేపట్టినల్లు పేర్కొంది.
వేడుకలో దుండగులు కాల్పులు.. 19 మంది మృతి
Mexico clandestine rooster fight: మెక్సికోలో దారుణం జరిగింది. ఓ వేడుక జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు.
మెక్సికోలో లాస్ టినాజాన్ ప్రాంతంలో ఇటువంటి హింసాత్మక దాడులు సర్వసాధారణమేనని చెప్పవచ్చు. ముఖ్యంగా బార్‌లు, పబ్‌లనే లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులపై డ్రగ్ ముఠాలు దాడులకు పాల్పడుతుంటాయి. సెంట్రల్ మెక్సికోలోని లాస్ టినాజాస్ ప్రాంతంలో పెట్రోల్ చోరీ మాఫియా ప్రభావం ఎక్కువ. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు చెందిన పైపులను చోరీ పాల్పడే ఘటనలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ముఠాల మధ్య దాడులు జరుగుతుంటాయి. తాజా దాడి కూడా లాస్ టినాజాన్ ప్రాంతంలోనే జరిగింది. ఈ ఘటనలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సాయుధ బలగాలు, నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.
ఇదీ చూడండి:అమెరికాలో కార్చిచ్చు బీభత్సం.. 19వేల మందిపై ఎఫెక్ట్