మెక్సికోలో కొందరు సాయుధ దుండగులు పెను బీభత్సం సృష్టించగా 18 మంది మరణించారు. మృతుల్లో సాన్ మిగ్వేల్ టోటోపాలన్ నగర మేయర్ కూడా ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకాకం బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన.. అక్కడి మాఫియా పనేనని అనుమానిస్తున్నారు.
రెచ్చిపోయిన మాఫియా.. నగర మేయర్ సహా 18 మంది హత్య - మెక్సికోలో నగర మేయర్ హత్య
నగర మేయర్ సహా మొత్తం 18 మందిని కాల్చి చంపారు సాయుధ దుండగులు. ఈ ఘటన మెక్సికోలోని గుర్రెరోలో బుధవారం మధ్యాహ్నం జరిగింది.
రెచ్చిపోయిన మాఫియా.. నగర మేయర్ సహా 18 మంది హత్య
గుర్రెరో రాష్ట్రం సాన్ మిగ్వేల్ టోటోపాలన్ నగరంలోని సిటీ హాల్ వద్ద అనేక మంది సాయుధ దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Last Updated : Oct 6, 2022, 9:26 AM IST