Spain Morocco Border Migrants: ఆఫ్రికాలోని మొరాకో- స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు కంచె వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. 2వేల మందికి పైగా వలసదారులు.. ఒక్కసారిగా కంచెను దాటడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి వలసదారులు మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
"మొరాకో సరిహద్దు నుంచి స్పెయిన్‌ను వేరుచేసే కంచెను కత్తిరించడానికి వలసదారులు ప్రయత్నించారు. అప్రమత్తమై వలసదారులను అదుపు చేశాం. చాలా మంది వలసదారులు వెనక్కి తగ్గగా.. 130 మంది మాత్రం ఒక్కసారిగా కంచె వద్దకు దూసుకొచ్చారు."