తెలంగాణ

telangana

ETV Bharat / international

జైలుపై ముష్కరుల దాడి.. 14 మంది మృతి.. మరో 13 మందికి గాయాలు - మెక్సికో లేటెస్ట్ న్యూస్

Mexico Prison Attack : మెక్సికోలోని ఓ జైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.

mexico prison attack
జైలుపై కాల్పులు

By

Published : Jan 2, 2023, 12:31 PM IST

Mexico Prison Attack : మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. సియుడాడ్​ జుయారెజ్​లోని జైలుపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. మృతుల్లో పది మంది గార్డులు, నలుగురు ఖైదీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 24 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. ముష్కరులు వాహనంపై ఆదివారం ఉదయం 7 గంటలకు జైలుకు వచ్చి కాల్పులు జరిపారని చెప్పారు.

మరోవైపు.. ఈ దాడికి సమయం ముందే పోలీసులు.. ఎస్​యూవీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ముష్కరులను హతమార్చారు.
కాగా, గత ఆగస్టులో ఇదే జైలులో అల్లర్లు చెలరేగాయి. అవి జుయారెజ్​ వీధుల్లోకి వ్యాపించాయి. ఈ హింసలో 11 మంది మరణించారు. ఆ సమయంలో జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలు సైతం హత్యకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details