Mexico bar shooting : మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. ఇరాపువాటో నగరంలోని ఓ బార్లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
అంతకుముందు అక్టోబరు 6న నైరుతి మెక్సికోలోని గుర్రెరోలో దుండగులు జరిపిన కాల్పుల్లో నగర మేయర్ సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
బార్లో షూటింగ్.. 12 మంది మృతి.. మరో ముగ్గురికి గాయాలు - మెక్సికోలో 12 మంది మృతి
మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు ఓ బార్లో జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.
బార్లో కాల్పులు
Last Updated : Oct 16, 2022, 2:33 PM IST