Boat Capsizes In Cambodia : దక్షిణ కంబోడియాలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. మెకాంగ్ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మొత్తం 10 మంది విద్యార్థులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి నలుగురు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఓ విద్యార్థి ఆచూకీ ఇంకా లభించలేదని పేర్కొన్నారు. మృతులంతా 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులని వెల్లడించారు.
ఘటన జరిగిన సమయంలో.. పడవలో ఎక్కువ ఉన్నారని చెప్పారు. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణించడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. విద్యార్థులు లైఫ్ జాకెట్లు సైతం ధరించలేదని చెప్పారు. ఈ ప్రమాదంపై కంబోడియా ప్రధానమంత్రి హున్సేన్ సంతాపం వ్యక్తం చేశారు. వరదల సమయాల్లో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.