తెలంగాణ

telangana

ETV Bharat / international

పోలీసులు, సాయుధుల మధ్య కాల్పులు.. పది మంది మృతి - మెక్సీకో కాల్పులు

Mexico Firing: మెక్సికోలో పోలీసులు, సైనికులు, సాయుధుల మధ్య జరిగిన కాల్పుల్లో పది మంది సాయుధులు మృతిచెందగా ముగ్గురు డిటెక్టివ్​లు సహా నలుగురు గాయపడ్డారు. ఘటనాస్థలిలో 20 రైఫిళ్లు, బుల్లెట్​ ప్రూఫ్ చొక్కాలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

mexico violence
mexico violence

By

Published : Jun 15, 2022, 8:17 AM IST

Updated : Jun 15, 2022, 8:43 AM IST

Mexico Firing: మెక్సికోలో మంగళవారం పోలీసులు, సైనికులు, సాయుధుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పది మంది సాయుధులు మరణించారు. ముగ్గురు డిటెక్టివ్​లు సహా నలుగురు గాయపడ్డారు. మెక్సికో నగరానికి 130 కి.మీ దూరంలో టెక్స్‌కల్టిట్లాన్ పట్టణంలో.. ఈ కాల్పులు జరిగాయి.
ఘటనా స్థలంలో 20 రైఫిళ్లు, పిస్టల్స్, మిలటరీ తరహా యూనిఫామ్​లు, బుల్లెట్ ప్రూఫ్ చొక్కాలను డిటెక్టివ్​లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో హత్యలు, దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.

Last Updated : Jun 15, 2022, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details