కరోనా మహమ్మారిని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనేందుకు వీలుగా టీకాలపై ఉన్న పేటెంట్ భద్రతను సడలించే దిశగా ప్రపంచ వాణిజ్య సంస్థ అడుగులు వేస్తోంది. మంగళవారం జరిగిన డబ్ల్యూటీఓ ప్యానెల్ సమావేశంలో పేటెంట్ హక్కులను సడలించాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు అమెరికా, చైనా సహా 58 దేశాలు మద్దతు తెలిపాయి.
ఐరోపా విముఖత..
పేటెంట్ భద్రతను సడలించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని ఐరోపా సమాఖ్య ఇప్పటికే స్పష్టం చేసింది. పేటెంట్‌ను రద్దు చేయకుండా.. డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు ప్రొడక్షన్ లైసెన్స్‌ను సంస్థలకు పంపిణీ చేయాలని సూచించింది.