Worldwide covid cases: ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే... ఈ వారంలో కరోనా కేసులు 11శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అమెరికాలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయని చెప్పింది. అక్టోబరు నుంచి ఈ పెరుగుదల నమోదవుతూ ఉందని పేర్కొంది.
WHO on corona: మంగళవారం 'వీక్లీ ఎపిడెమిక్ రిపోర్ట్'ను డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. డిసెంబరు 20-26 మద్య ప్రపంచవ్యాప్తంగా 49లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పింది.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- మొత్తం కొత్త కేసుల్లో... సగం కంటే ఎక్కువ కేసులు ఐరోపాలోనే వెలుగు చూశాయి. ఐరోపాలో డిసెంబరు 20-26 మధ్య కొత్తగా 28 లక్షల మంది వైరస్ బారినపడ్డారు.
- అయితే... గత వారంతో పోలిస్తే ఇది 3శాతం మాత్రమే పెరుగుదల కావడం గమనార్హం.
- ప్రపంచవ్యాప్తంగా ఐరోపాలోనే అత్యధిక ఇన్ఫెక్షన్ రేటు ఉంది. అక్కడ లక్ష మందిలో 304.6 మంది చొప్పున కరోనా బారినపడుతున్నారు.
- అమెరికావ్యాప్తంగా కొత్త కేసులు 38శాతం మేర పెరిగాయి. కొత్తగా 14.8 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
- ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యధిక ఇన్ఫెక్షన్ రేటు అమెరికాలోనే ఉంది. లక్ష మందికి 144.4 మంది చొప్పున వైరస్ బారినపడుతున్నారు. ఒక్క అమెరికాలోనే 18 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
- ఆఫ్రికాలో గత వారంతో పోలిస్తే.. కొత్త కేసులు సంఖ్య 7శాతం మేర పెరిగింది. అక్కడ 2,75,000 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.
- గత వారంతో పోలిస్తే కరోనా మరణాలు 4శాతం మేర తగ్గాయి. కొత్తగా మరో 44,680 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
'ఒమిక్రాన్'తో రిస్క్ ఎక్కువే..