ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 5 లక్షల మందికిపైగా వైరస్ సోకింది. అమెరికాలోనే 1.73 లక్షల మంది వైరస్ బారినపడగా.. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటిన్నర దాటింది. బ్రెజిల్, రష్యాలతో పాటు టర్కీలోనూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
అమెరికాలో కోటిన్నర దాటిన కరోనా కేసులు
By
Published : Dec 7, 2020, 7:26 AM IST
ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి మహా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు వేలాది మందికి సోకుతూ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 5.34 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఏడున్నరవేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత కొత్త కేసుల నమోదులో భారత్, టర్కీ, రష్యా, బ్రెజిల్‌లు ఉన్నాయి.
మొత్తం కేసులు: 67,377,122
మరణాలు: 1,541,370
కోలుకున్నవారు: 46,571,781
క్రియాశీల కేసులు: 19,263,971
అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 1,73,861 కేసులు నమోదయ్యాయి. 1,076 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య కోటిన్నర దాటింది.
టర్కీపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకు 30 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 30,402 మందికి వైరస్ సోకింది. 195 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 8.28 లక్షలు, మరణాలు 14.9 వేలకు చేరుకున్నాయి.
రష్యాలోనూ వైరస్ ఉద్ధృతి అధికంగానే ఉంది. కొత్తగా 29వేలకుపైగా కేసులు వచ్చాయి. ఆ తర్వాత బ్రెజిల్లో కొత్త కేసులు 26 వేలకుపైగా నమోదయ్యాయి. ఇటలీలో 18వేలు, బ్రిటన్‌లో 17 వేలకుపైగా మందికి వైరస్ సోకింది. ఫ్రాన్స్, మెక్సికో, ఇరాన్, ఉక్రేయిన్లలో 11వేల చొప్పున కొత్త కేసులు వచ్చాయి.