తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంలోనే ఖరీదైన 'విస్కీ'..ధరెంతో తెలుసా? - Macallan whisky news

లండన్​లో నిర్వహించిన వేలంపాటలో ఓ విస్కీ బాటిల్​ ఏకంగా 1.5మిలియన్​ పౌండ్ల ధర పలికింది. 60ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ విస్కీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది.

ప్రపంచంలోనే ఖరీదైన 60ఏళ్ల విస్కీ..ధరెంతో తెలుసా?

By

Published : Oct 26, 2019, 7:55 AM IST

ప్రపంచంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌... వేలంలో 1.5 మిలియన్‌ పౌండ్లకు అమ్ముడు పోయింది. మెకల్లాన్‌ పేరుతో 60ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ విస్కీ...గతేడాది 1.2 మిలియన్‌ పౌండ్లకు అమ్ముడుపోయిన మరో బాటిల్‌ రికార్డును బద్దలుకొట్టింది. స్కాచ్‌ విస్కీ విభాగంలో ఈ బాటిల్‌ ఎంతో ప్రత్యేకమైనదని వేలం పాట నిర్వాహకులు తెలిపారు. దీని రుచి అద్భుతంగా ఉంటుందన్నారు.

మెకాల్లన్​-1926 విస్కీ బాటిల్ ఇంత రికార్డు ధరకు అమ్ముడపోతుందని ఊహించలేదు నిర్వాహకులు. గతేడాది 1.2మిలియన్​ పౌండ్లు పలికిన మరో బాటిల్​ కూడా మెకాల్లన్​దే.

సదబీస్​ సంస్థ నిర్వహించిన వేలంపాటలో మొత్తం 467 బాటిళ్లు 76లక్షల 35వేల 619పౌండ్లకు అమ్ముడుపోయాయి.

ఇదీ చూడండి: బ్రెజిల్‌ వెళ్లాలంటే ఇక వీసా అవసరం లేదు..!

ABOUT THE AUTHOR

...view details