తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్​

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మతపెద్దలు ఖురాన్‌ సందేశాన్ని వినిపించారు. చారిత్రక మసీదుల్లో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయా దేశాల ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కనులపండవలా బక్రీద్​ వేడకలు

By

Published : Aug 12, 2019, 5:01 AM IST

Updated : Sep 26, 2019, 5:26 PM IST

ప్రపంచవ్యాప్తంగా కనులపండవలా బక్రీద్​ వేడకలు

ముస్లింలకు పవిత్రమైన పండుగల్లో బక్రీద్​ ఒకటి. అనేక దేశాల్లోని ముస్లింలు ఈ పర్వదినాన ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

సిరియా రాజధాని డమాస్కస్​లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్​​ అసద్​ హాజరయ్యారు. వారితో పాటు మత పెద్దలు, అధికారులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. సిరియాలో కొన్నేళ్లుగా విధ్వంసం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాటు చేశారు.

రష్యాలో ఈద్ వేడుకలు

రష్యా మాస్కోలోని అతిపెద్ద మసీదులో వేలాది మంది ముస్లింలు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. మసీదు ప్రాంగణం అంతా కిటకిటలాడింది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

జెరుషలేములో ప్రత్యేక ప్రార్థనలు

ఇజ్రాయెల్​ జెరుషలేములోని పవిత్ర స్థలంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డోమ్ ఆఫ్ ది రాక్, అల్-అక్సా మసీదులను ముస్లింలు మూడో పవిత్రమైన ప్రాంతంగా పరిగణిస్తారు.

ఇండోనేసియా, ఆఫ్గానిస్థాన్​​లో కనులవిందుగా

ఇండోనేసియా జకార్తాలోనూ బక్రీద్​ ప్రార్థనలు మిన్నంటాయి. అల్​ అజార్​ మసీదు వద్ద అన్ని వయసుల వారు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. ఆఫ్గానిస్థాన్​లో బక్రీద్​ వేడుకలు ఘనంగా జరిగాయి. వయోభేదం లేకుండా శ్రద్ధగా ప్రార్థనలు నిర్వహించారు.

Last Updated : Sep 26, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details