ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కొత్తగా 6 లక్షల మందికిపైగా వైరస్ సోకింది. 10వేలకుపైగా మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6.68 కోట్లు దాటింది. అగ్రరాజ్యంలోనే అత్యధికంగా రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత బ్రెజిల్, భారత్ ఉండగా.. టర్కీలోనూ వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
ప్రపంచంపై కరోనా పంజా
By
Published : Dec 6, 2020, 8:45 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహావిలయం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఒక్కరోజులోనే 6.20 లక్షలకుపైగా మందికి వైరస్ సోకింది. 10వేల మందికిపైగా మరణించారు. అమెరికా, భారత్, బ్రెజిల్‌తో పాటు టర్కీ, రష్యా, ఇటలీల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
మొత్తం కేసులు: 66,847,041
మరణాలు: 1,534,344
కోలుకున్నవారు: 46,235,090
క్రియాశీల కేసులు: 19,077,607
అమెరికాలో కరోనా పంజా విసురుతూనే ఉంది. శనివారం కొత్తగా 2,08,790 మందికి వైరస్ సోకింది. 2,251 మంది మరణించారు.
బ్రెజిల్లో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొద్దిరోజులుగా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ.. తాజా 42వేలకుపైగా కొత్త కేసులు రావటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే 660 మంది ప్రాణాలు కోల్పోయారు.
టర్కీలో కరోనా మహమ్మారి మహావిలయం కొనసాగుతోంది. రోజుకు 30 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం 31,896 కొత్త కేసులు రాగా మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువైంది.
రష్యా, ఇటలీలోనూ వైరస్ ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఈ రెండు దేశాల్లో 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇరాన్‌లోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 12వేలకుపైగా కేసులు రాగా.. మొత్తం కేసులు సంఖ్య 10 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 50 వేలకు చేరింది.