కరోనా వ్యాక్సిన్లు పొందటంలో దేశాల మధ్య అసమానతలు ఆమోదయోగ్యం కాదన్నారు ప్రపంచ వాణిజ్యం సంస్థ(డబ్ల్యూటీఓ) అధినేత నగోజీ ఒకోంజో. అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకా తయారీ సామర్థ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు పొందేందుకే అనుకూలంగా ఉండటం సరికాదని పేర్కొన్నారు.
మహమ్మారుల సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వయంచాలితంగా, సాకేతికంగా వ్యాక్సిన్లు తయారీకి అవకాశం కల్పించే వ్యవస్థ రూపకల్పనకు తాను మద్దతు ఇస్తానన్నారు ఒకోంజో. డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మైరేతో సమావేశం అనంతరం ఈ మేరకు వెల్లడించారు ఒకోంజో.
" ప్రస్తుతం కేవలం 10 దేశాలే 70 శాతం వ్యాక్సిన్లు పొందటం అనేది ఆమోద యోగ్యం కాదు. టీకా అసమానతలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. "