40 లక్షల కరోనా(Corona) మరణాలతో ప్రపంచం ఒక 'విషాద మైలురాయి'ని దాటిందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. ఈ మహమ్మారితో ప్రమాదకర స్థితికి చేరుకున్నట్లు వ్యాఖ్యానించారు.
"మహమ్మారి వేళ ప్రమాదకర దశకు ప్రపంచం చేరుకుంది. 40 లక్షల కరోనా మరణాలతో ఒక విషాద మైలురాయిని దాటాం. నిజానికి అంతకన్నా ఎక్కువే చనిపోయి ఉంటారు. భారీ స్థాయిలో టీకా పంపిణీ చేసిన దేశాలు.. మహమ్మారి అంతరించిపోయిందన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆంక్షలను సడలిస్తున్నాయి."
- టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్