కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ విద్యావ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. లక్షలాది మంది బడిపిల్లలు పాఠశాలలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"ప్రస్తుతం మనం విద్యా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. కొవిడ్ కారణంగా 15 కోట్ల 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. ఇందులో 2 కోట్ల 50లక్షల మంది తిరిగి బడికి రాకపోవచ్చు. సమర్థవంతమైన మహమ్మారి పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంపొందించడం, డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించడం చేయాలి. దీంతో భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొగలం."